#217

ఆయన యుగయుగములు జీవించుచున్నాడు

రాగం: బిలహరి (ఛాయ: వీరులు పాడుడి) · తాళం: త్రిపుట · రచయిత: కడియం గాబ్రియేలు

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
పాపము జయింపబడినది. చెట్టు. సమూహము.హల్లెలూయయని పాడుడి – దుఃఖించకు డో – చెలియలారా వినుడి – సొలయకుండగా మీరు అలటునిటు – చూచుచుండుట యెవరిని – ఫలము లేదిక బ్రతుకు యేసు – ప్రభుని వెదకుట మృతులలో ॥హల్లెలూయ॥
చరణము 1
హల్లెలూయయని పాడుడి – యేసు ప్రభుని – వలననే గలిగె గెలుపనొందుడి – ఇలయు బరమును సఖ్యపడెనయ్యెను – గలిగె హర్షము చావు చే – సిలువ చింతలు మాని, పొందుడి – కలకాలం బగు మోదము ॥హల్లెలూయ॥
చరణము 2
హల్లెలూయయని పాడుడి – మీ భూరి చిం – తలుతీరె మది నమ్ముడి – బలహీనపు చిన్న మందా! – ప్రభుని చెంతకు మరలుము – కలుగు జీవము మిమ్ము నాయన – కరుణతో నడుపును సదా ॥హల్లెలూయ॥
చరణము 3
హల్లెలూయయని పాడుడి – సంఘము సదా – నిలిచి యుండును సుమండీ – పలు తెరంగుల రిపుల వలనను – బాధ లెన్నియు గలిగినన్ – దొలగ కేమియునన్ని యెడల – గెలిచి వర్ధిల్లుచుండును ॥హల్లెలూయ॥
చరణము 4
హల్లెలూయ యని పాడుడి – దేవుని బోధ – కుల సర్వరాష్ట్రంబుల – నెలమి మహిమకు ప్రథమ ఫలమగు – యేసు రక్షణ వార్తను – వెలుగు వలె బ్రసరింపజేయుదు – రిలను ధృతితో నేర్పుతో ॥హల్లెలూయ॥
చరణము 5
హల్లెలూయయని పాడుడి – భక్తులారా – విలపింప వద్దు సుండీ – కలుగకుండుడి సందియంబులు – గడచు కాలము శీఘ్రమే – కలుగు మీకు సమాధి మిమ్మును గౌరవింప నెమ్మది ॥హల్లెలూయ॥
చరణము 6
హల్లెలూయయని పాడుడి – గోధుమ గింజ – వలె బ్రతుకుదురు మీరు – ఇల ప్రభువు తన పంట గూర్పను – నెగుదెంచును చివరిను – దొలగజేయును గురుగులను గో – ధుమలనుండి నిజంబుగా ॥హల్లెలూయ॥