#215
క్రీస్తు పునరుత్థానము
పల్లవి · Pallavi
సుదతులారా మీ – రిచ్చోట నెవ్వరిని – వెదకుచున్నారు – మృదువుగాను – జీవించువాని పెద్ద – నిదురబోయినట్లు – లెదలందు భావించి ॥సుదతులారా॥
చరణము 1
ఇచ్చట లేడు లేచి – యున్నాడు ప్రభు క్రీస్తు – యేసు స్వతంత్రుడై – ప్రచురంబుగా దన – పాటులు లేచుటయును – వచియించె గలిలయ – వర దేశమున మీతో ॥సుదతులారా॥
చరణము 2
మనుజ కుమారుడు – కుత్సిల పాపిష్టుల చేత – మరణమొందుట సిలువ పై – దనకు దానే మూడవ – దినమందు లేచుట – యును దెల్పె గద మీరు – వినుచుండగ దొల్లి ॥సుదతులారా॥
చరణము 3
ఎదలలోన జ్ఞాప – కము చేసికొనుడింక – యేసు తెల్పిన మాటలు – ముదముతో జీవమును – గని లేచెనను వార్త – సుదతు లాలకించి – రది నిక్కముగా దోచ ॥సుదతులారా॥