#214
పునరుత్థాన విజయము
పల్లవి · Pallavi
రండు విశ్వాసులారా – రండు విజయము సూచించు – చూపెడెడు సంతోషంబును గలిగి – మెండుగా నెత్తుడి రాగముల్ – నిండారు హర్షము మనకు – నియమించె దేవుడు – విజయము, విజయము, విజయము, విజయము ॥విజయము॥
చరణము 1
నాటి సమయమన్ని యాత్మలకును – నీ తగు వసంత బుతువుగును – వాటముగా జెరసాలను గెలిచె – వరుసగ మూన్నాళ్ళు నిద్రించి – సూటిగ లేచెను – యేసు – సూర్యుని వలెను ॥విజయము॥
చరణము 2
కన్ను కన్నుగానని చీకటి – కాలము క్రీస్తుని కాంతిచే – నిన్నాళ్లకు శీఘ్రముగా బోవు – చున్నది – శ్రీ యేసుని – కెన్నాళ్ల కాగని – మన – సన్నుతుల్ భువిన్ ॥విజయము॥
చరణము 3
బలమగు మరణ ద్వార బంధ – ములు నిన్ బట్టక పోయెను – వెలుతురులేని సమాధి గుమ్మ – ములు నిన్నాపక పోయెను – గెలువ వాయెను – కా – వలియు ముద్రయు ॥విజయము॥
చరణము 4
పన్నిద్దరిలోపల నీ వేళ – సన్నుతముగా నీవు నిలిచి – యున్నావు మానవుల తెలివి – కెన్నడైన నందని – యున్నత శాంతిని – న – నుగ్రహింతువు ॥విజయము॥