#213
క్రీస్తు పునరుత్థాన చరిత్రము
పల్లవి · Pallavi
చక్కగా. స్త్రీలు. ఆదరించెను.కొరత పైని మరణమొందిన – నజరేయుడేసు – కొరకు మిగుల వెదకుచుండిన – తరుణులారా మీ ప్రభువుండు – తిరిగి బ్రతికి నిక్కముగా – సత్వరమే పేతురాది శిష్య – సమితితోడ జెప్పుడునియె ॥మరణము॥
చరణము 1
మానితముగా మీకంటి ముందు – ప్రభువనిన యట్లు – కానబడును గలిలయమందు – గాన వెళ్ళుడంచు భాసి – తానుండు పల్కు వినుచు – దీన జనులు జడిసి మిగుల – దిగులు నొంది వణకినప్పుడు ॥మరణమునన్॥
చరణము 2
మొదట మగ్దలేనే మరియకు – గనబడెనటంచు – సుదతి చెప్పె శిష్యవరులకు – కొదువలేని సంతోషమున – గోరె తీర ప్రభుని జూడ – బదిలమైన యత్నములకు – బరగ జేసి చూచినప్పుడు ॥మరణమునన్॥
చరణము 3
అంతఃశత్రువైన మరణమును – ప్రభువు గెల్చె – సంతోషించి సన్నుతింతము – వంత లేక భక్తులారా – వాస్తవముగా మనల నిటుల – నంత్యదినము నందు లేపు – నమల దేహముల నొసంగు ॥మరణమునన్॥