చరణము 1
మహాత్ముడైన నా ప్రభుమహాత్ముడైన నా प्रभु విచిత్ర సిలువ జూడగా – నాయాస్తినష్టముగా నెంచి – గర్వమణగ ద్రొక్కుదున్.నీ సిలువ గాక యో దేవా – దేనిని ప్రేమింప నీయకు – నన్నాహరించు సర్వమును నీ సిలువకై త్యజింతును.శిరంబు పాద హస్తముల్ – నూచించు దుఃఖ ప్రేములు – మరెన్నడైనా గూడెనా విషాదప్రేమ లీ గతినే?ముండ్లన్ దుర్మార్గులల్లిన కిరీటమేసు కుండినన్ – ఈ భూకిరీటములన్నీ దానం దూగంగజాలునే?లోకంబు నే నర్పించినను యోగ్యమైన యీవి యౌ – వింతైన యేసు ప్రేమకై – నా యావజ్జీవమిత్తును.రక్షించబడ్డ లోకమా – రక్షించ జావ బొందిన – రక్షకుడేసుని సదా – రావంబుతోడ గొలువుమా.