#211
I am coming to the Cross
చరణము 1
సిలువ యొద్ద చేరెదన్సిలువ యొద్ద చేరెదన్ బీద హీన దీనుడన్ – లోకమును త్యజింతును – పూర్ణ ముక్తి నొందుదున్
చరణము 2
॥కర్తా, నిన్నే నమ్ముదున్ – కల్వరి గొర్రెపిల్లా – మోకరించి వేడెదన్ – నన్ను గావుము ప్రభు॥
చరణము 3
నిన్ను నేను చేర గోరగా నన్ను బాయు పాపము శుద్ధిచేతునంచును – యేసు మాట యిచ్చెను ॥కర్తా॥
చరణము 4
నన్ను నా మిత్రులను లోక యాస్తి కాలమును దేహ యాత్మ యంతయు నీ కర్పింతు నిప్పుడు ॥కర్తా॥
చరణము 5
యేసు మాట నమ్మెదన్ – క్రీస్తు రక్త పుణ్యము – ఈజీ మ్రొక్కి యేసుతో – నేను మృతినొందితిన్ ॥కర్తా॥
చరణము 6
యేసు తాను వచ్చును – నాకు నిచ్చు పూర్ణతన్ – శుద్ధ సౌఖ్యమొందుదున్ – జయ స్తోత్ర మీసునకు ॥కర్తా॥