#210
O Sacred Head once wounded (ఓ ముండ్ల కిరీటమా)
చరణము 1
హా! ముండ్ల కిరీటంబు భరించు శిరసా! నీకిప్పుడపకీర్తి హాస్యంబు గలిగెనుగా! కర్తా! ఘనంబు కీర్తి ఎన్నడు గలుగుగా!
చరణము 2
లోకంబు రీతి నొందు ప్రకాశపూర్ణుడా! ఆ యూదులైనవారు నీ మోము మీదను నాడు ఉమ్మివేసినారా? నీ ముఖకాంతికి నాకోసమింత బాధ వహించినావుగా!
చరణము 3
దైవోగ్ర బాధ కేను పాత్రుండనైయుంటిన్ దృష్టించి నన్ను జూచి కటాక్షముంచుమీ. నీవు ఓర్చినట్టి బాధ నా క్రూర పాపమే!
చరణము 4
నే బాపనైతిగాని నన్ను నీవు చేర్చుము! నీ నిత్య ఊటనుండి మేలెల్ల పారును! నీ నోరు మాధుర్యంపు సుబోధ జెప్పెను.
చరణము 5
నా కోసమింత బాధ వహించినందుకు! యథార్థమైన స్తుతి నిత్యంబు నీదగున్. నీ నామమందు నేను విశ్వాసముంతును నా అంత్యకాలమందు నా యొద్దనుండుము.