#209
యేసు క్రీస్తు మరణావస్థ ధ్యానము
పల్లవి · Pallavi
నా కొరకు చనిపోయి నాడే – ఆదర యాకరుండీ వంక దొంగలతోడ ॥నా కొరకు॥
చరణము 1
ఆలకింపగను మనసార – నాకు – నానందయా దయామృత సారధార –భూలోకమున దనివి తీర – నిట్టి – పుణ్యాత్మునొకపూజింతును మీర ॥నా కొరకు॥
చరణము 2
కన్న తల్లిదండ్రులకు నైన – యింత ఘన వత్సలత నే – గలుగుటంగాన – విన్నదియు లేదు చెవులార – స్వామి – విక్రయంబైకొరత – వేదనలతోను ॥నా కొరకు॥
చరణము 3
కటకము వంటి నన్ను బ్రోవ – సొంత – కల్వరి కొలాలమర్పించి – ఖేదపడి చావు– వాటమా తన కీడుల గావ – నేను –వర్ణింప కన్నీరు – వరదలై పోవ ॥నా కొరకు॥
చరణము 4
ఘోరముగ నినుపమేకులను – గ్రుచ్చి – కొంకాక నిర్దయుల్– గొల్గొతామనలను –మరణంబగు నవస్థలను – బెట్ట – మాదృశాత్మకాగా –మౌనములై యులను ॥నా కొరకు॥
చరణము 5
ఏమి బహుమతులు అర్పింతు – నట్టి –స్వామి మీ కెల్లెడలా – స్వాంతముననుంతున్ – ప్రేమ భావమున వర్ణింతున్ – నిత్య – కామితార్థమిడు – కర్తను భజింతున్ ॥నా కొరకు॥
చరణము 6
నాడు – సిలువపై జచ్చిన – నాకరునిహితము – పాయకా ప్రభు సత్యవ్రతము – నాథు –ప్రాణాంతమౌదాక ప్రార్థింతు సతము ॥నా కొరకు॥