#207
సిలువ మరణము
పల్లవి · Pallavi
గలిగె గలిగెనొకప్పుడు – సినాయు బాబెలుకట్టడము కట్టునప్పుడు –పలుకు భాషయు నొక్కటైనను – పలువిధములగుభాషలాయెను – నలుదిశలకును జనులు పోయిరి – కల్వరి పై గలిసికొనిరి ॥ఎంత॥
చరణము 1
పావనుండగు ప్రభువు మనకొరకై – యాసిలువమీద చావునొందెడు సమయమందున – దేవుడా నా దేవుడానన్నేల చేయివిడిచితివి యనియు – రాముగా మొగము బెట్టెను యే – యెహోవాయను దన తండ్రితోను ॥ఎంత॥
చరణము 2
అందు తిమిరము క్రమ్ము గడియయయ్యె – నానీతి సూర్యుని నంత చుట్టెనుబంధకంబులు – నింద వాయువు లెన్నో వీచెను –కందు యేసుని యావరించెను– పందెముగా నొక కాటువేసెను – పాత సర్పముప్రభువు యేసును ॥ఎంత॥
చరణము 3
శాంతమాయెనటంచు పలుకుచును – ఆ రక్షకుండు తన – స్వంత విలువగుప్రాణమును వీడెన్ – ఇంతలో నొక భటుడు తనదగు –ఈటెతో ప్రభుప్రక్క బొడువగా – చెంత జేరెడి పాపులను ర – క్షించురక్తపు ధార గారెను ॥ఎంత॥