#206
సిలువ శ్రమలు
పల్లవి · Pallavi
కరుణాసాగర వీవేకావా – మరణము పొందిన సిలువ మెట్టుకుమోసినావా – కరుణాసాగర వీవేకావా – మరియు కల్వరిమెట్టుమీదను కడకు మేకులు గొట్టబడి నీ – మరణ రక్తాము చేతనరులకు – పరమ రక్షణ తెలిప్పినావా ॥కరుణా॥
చరణము 1
జగతీ రక్షక పురవిహారా – నరులనుబ్రోవ నరుడై యొందిచినావా – జగతీ రక్షక పురవిహారా – ప్రజల పాపము పరిహరియు – ప్రజల సద్గతి నొందిజేయను – విజయమును పొందితివి ఇలలో – సజ్జనులందరు భజన సేయగా ॥జగతీ॥
చరణము 2
మరియ యను కన్యకు కుమారా – నరక బాధదప్పించినావా – మరియ యను కన్యకు కుమారా – మార్గ సత్యము జీవమునుమహిని నమ్మినవారి కెల్లను – మీరే గాక యిక వేరే లేరని – సారెసారెకుజెప్పినావా ॥మరియ॥
చరణము 3
మహిలోను మనుజ కుమారా – యెహోవా తండ్రినివేడినావా – మహిలోను మనుజ కుమారా – యిహములో నిన్ను నమ్మువారిని – బహు నీ కటాక్షంబు చేతను – మహిమ జనకా గావుమనుచు – త్రాహి యనిప్రార్థించినావా ॥మహిలోను॥
చరణము 4
పరమ తండ్రి ప్రియ కుమారా – పావనము చేయ మీరే కారా – పరమ తండ్రిप्रिय కుమారా – పరముడా నీ పంచ గాయములు అలరయగారక్తముతో నిండెను – ధరను మా పాపములు – గడుగను – స్థిరముగాను ఉత్తరము నాయెను ॥పరమ॥