#205
సిలువ ధ్యానము
పల్లవి · Pallavi
ఏమి నేరంబు లేక – యామరణ స్తంభభూమి – నాపై మోయ నాయెనను – నా యేసు – ఎంత కఠోరములాయెను చూడీ మానవులు యెరూషలేము బయలు వెడలి – నాకేమి నేరముతోచెను ॥ఏమి॥
చరణము 1
మును విన్న దీర్ఘదర్శులు – లెన్నిన రీతిని –కన్నెకడుపున బుట్టిన – నా యేసు –వన్నె మీరంగ బెరిగిన చొక్కనైన నీ మేను –చెమట బుట్టంగ నీ – కెన్ని కడగండ్లు ఆయెనను ॥ఏమి॥
చరణము 2
కన్నతల్లి యిట్టి – కడగండ్లు గాంచిన –కడుపేరీతినోర్చును – నా యేసు – గాంచన లేనను గూలను చు నిన్నెరిగినట్టివారు – నీ పాటులు గని యేడ్చు – చున్నారు ఈ వేళను ॥ఏమి॥
చరణము 3
అయ్యయ్యో యూదు – లెంత అన్యాయంబు దప్పితీర్చినందు – భయంబు విడిచి పోని – నా యేసు – మోయ శక్యంబు గానికొయ్య మూపున నెత్తి – రయ్య నీ కెంత భార – మయ్య మోసెదవజాలను ॥ఏమి॥
చరణము 4
పిల్లలాట్లాడినట్లు – ముల్లులతో కిరీటము మల్లినెత్తిన గొట్టిరి – నా యేసు – పల్లరులు పలికాధిక మోదరి – ఎల్లవారిలోనిన్ను – ఎగతాళి గావించి – మొగముపై నుమ్మివేసిరి ॥ఏమి॥
చరణము 5
కొరడాలతో నిన్ను – గొట్టి కండ్లకు గంత – గట్టిచేజేరి వేడకను – నా యేసు – అట్టి వారెవ్వరంచు చు – విరగ బాసంబునడిగి – వెక్కిరించుచు నీ –వెంబడి వచ్చుచున్నారు ॥ఏమి॥
చరణము 6
ఏడ్చేవారు నడువ – మోయలేక స్తంభములను – నేల బారిన రీతిగా – నా యేసు – మోయలేక బారినట్లుగా – ఏల యీకొడగండంబు – లేల నీమీద కట్టుట – ఏమి నేరంబు లేదుగ ॥ఏమి॥
చరణము 7
చాల బాధించి క – పాల స్థలమునకు వచ్చి – నేలబారిన కొయ్యను – నా యేసు – జాలి రవ్వంత లేకను – కాలు సేతులనుప్పుచీలలతో బిగించ – జిమ్మే రక్తంబు గారెను ॥ఏమి॥
చరణము 8
నా దేవా నా దేవా – నన్నెందుకై విడిచి –నా వంచు మొరలిడితివి – నా యేసు – నమ్మితివి లోబడితివి – వేదనధికమాయె – నేదిక్కు లేనట్లు – యూదాళి కగపడితివి ॥ఏమి॥
చరణము 9
అంధకారము దేశ – మంతటా గెలిగెను – ఆవరించెనుసూర్యుని – నా యేసు – ఆలయపు తెర చిరిగెను – బంధ స్తంభమునుండి – బహుగొప్ప శబ్దముతో బిలిచెద వేమిటను ॥ఏమి॥
చరణము 10
ఓ తండ్రి నీ చేతి – కొప్పగించుచున్నాను – ఒనరంగ నా యాత్మను – నా యేసు– అని ప్రాణమును వీడెను – ఏ తప్పిదంబు లేక – నీ పాటు నొందితివి – ఎంతో వింతైనిలుచును ॥ఏమి॥
చరణము 11
నీ చాతురుడొక్కడు నిశ్చ – యింప బల్లెముతోడ – నీ ప్రక్క బొడిచె చావను – నాయేసు – నీరు నెత్తురు గారెను – అరియున్నట్టి కసి – కెట్లు నీ యొడలు సైచె – నెంతో చోద్యంబు చూడను ॥ఏమి॥
చరణము 12
పాపాత్ములకై పూట – బడినందువలనే యింత – పరితాప మరణమాయెను –నా యేసు – ఎరిగే యనుభవించెను – నా పాప ఫలము నిన్ను – ఏ పాటులు బెట్టి చంప – నోపితివయ్య ప్రేమను ॥ఏమి॥
చరణము 13
ఎంత అమూల్యమైన – దెంత యనంతమైన – దెంత గాధమైనది – నాయేసు – ఎంతో యుచితమైనది – ఎంతో వింతైన ప్రేమ – హేయులమైనమాకు – ఏల కనుపరచబడ్డది ॥ఏమి॥
చరణము 14
ప్రేమాతిశయుడనైన – ఏ మాత్రుడను నన్ను – నా మానసమున కందను – నాయేసు – ప్రేమ సారంబు తెలియను – పామరులను బ్రోచు – క్షేమాధికారి నిన్ను –ఏమంచు వర్ణింతును ॥ఏమి॥