#199

క్రీస్తు సిలువయే మన మహిమ

రాగం: ఆనందభైరవి (ఛాయ: నాకై చీలిన యుగ) · తాళం: కురుజంపె · రచయిత: విలియం డాసన్

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
సిరులెల్ల వృథా కాగా – పరికించి నాకుండ – గురువము దిరస్కరింతునువర మహిమ రార రాజు – మరణాద్భుతపు సిలువ – నరయుచున్నట్టి వేళన్ – ముఖ్యములైన ||సిరులెల్ల||
చరణము 1
ఓ కర్త నా దేవుడు – క్రీస్తు మృతియందు – గాక మరి మురియ హేయముప్రాకట భ్రమకారి – వ్యర్థ వస్తువులను – ప్రభుని రక్తంబు కొరకై – త్యజింతును ||సిరులెల్ల||
చరణము 2
చారు మస్తక హస్త – పాదములవలన వి – చారంబు దయయు గలసిసారె ప్రవహించుచున్నది జూడు మెప్పుడట్టి – దారి గలదా ముళ్ళు – తగు కిరీటంబున ||సిరులెల్ల||
చరణము 3
వాని నిజ రక్తంబు – వస్త్రంబువలె సిలువ – పైనతని తనువు గప్పెనైననే నీ లోక – మంతటికి మృతుడనై – యున్న నా హృదయ లోకము – మృతంబయ్యె ||సిరులెల్ల||