#198
సిలువ బలము
పల్లవి · Pallavi
సిలువే నా శరణాయెనురా – నీ – సిలువే నా శరణాయెనురాసిలువ యందే ముక్తి బలము – జూపితివిరా ||నీ సిలువే||
చరణము 1
సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందువిలువలేని ప్రేమామృతము – గ్రోలితిరా ||నీ సిలువే||
చరణము 2
సిలువను జూచుకొలది – శిలాసమానమైన మనసునలిగి కరిగి నీరగుచున్నదిరా ||నీ సిలువే||
చరణము 3
సిలువను దరిసి తరచితి – విలువ కందగ రాని నీ కృపకలుష మెల్లను బాపగ జాలునురా ||నీ సిలువే||
చరణము 4
పలువిధ పదవములరసి – ఫలితమేమి గానలేకసిలువ యెదుటను నిలిచినాడనురా ||నీ సిలువే||
చరణము 5
శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువాదురిత దూరుడ నీ దరి జేరితిరా ||నీ సిలువే||