#197
సిలువ ధ్యానము
పల్లవి · Pallavi
అయ్యో నాదగు ఘోర పాపము గదా – భారమై నీపై నొరిగెనెయ్యము వీడి మెస్సయ్య నిన్ సిలువ – కొయ్యపై గొరత కప్పగించిన ||దయ్యో||
చరణము 1
నిరతము దూతానీకము గూడగ – నేర్పుచుండ దండ్రి ప్రసన్నుండైయునిరుపమాన సౌఖ్యముల దేల నిన్ను – బరమునుండి క్రిందికి దిగలాగిన ||దయ్యో||
చరణము 2
కోరి నిన్ను గడు పారగనియు గన – లార చూచుకొన నేరనట్టి యలమేరి గర్భమున దూయబడిన కడు – ఘోరమైన ఖడ్గంబు నిజముగ ||నయ్యో||
చరణము 3
మోయరాని పెనుకొయ్య నొండు నీ – మూపుపై భారముగ మోపిరయ్యయ్యో యింత బాధ సిలిపినది యూ – దయ్యు వాసు లెంత మాత్రమునుగా ||రయ్యో||
చరణము 4
కోలలచే నెన్నెన్నో పెట్టు పెను – గోలగాక యెన్నెన్నో తిట్లు కృపమాలి నీదు వదనమ్ముపై నుమియ – నేల నింత కోపంబు రాదు నిజ ||మయ్యో||
చరణము 5
ముండ్లతోడ మకుట మొక్కటె మళ్ళి కడు – మూర్ఛతో నీ తల పైన బెట్టి నీకొండల కొక్క గంత గడగండ పెట్టి – కారణము నిజముగ ||నయ్యో||
చరణము 6
ఈవు ప్రాణమును నీవుగ నొసంగ – నీ దయతోడు ప్రక్కను బొడుచుట హాభావమందున దలపోసి చూడ నల – బంటు గాదు బల్లెంబు గాదు నిజ ||మయ్యో||