#196
క్రీస్తు సిలువమీద పలికిన యేడు మాటలు
పల్లవి · Pallavi
ఆహా మహాత్మ హా శరణ్యా – హా విమోచకాద్రోహ రహిత చంపె నిను నా – దోషమే గదా ||ఆహా||
చరణము 1
"వీరిని క్షమించు తండ్రి – నేర మేమియున్" – కోరి తిటుల నిన్ను జంపు – క్రూర జనులకై ||ఆహా||
చరణము 2
"నీవు నాతో పరదై నను – నేడె యుందువు" – పావనుండ రిటుల బలికి – పాపినేలితివి ||వాహా||
చరణము 3
"అమ్మా! నీ సుతుడు" – అంచు మరి – యమ్మతో బలికి – క్రమ్మర "నీ జనని" యంచు – గర్త నుడివితివి ||వాహా||
చరణము 4
"నా దేవ దేవ యేమి విడ – నాడితివి" – అనుచు శ్రీ దేవు సుతుడు పలికితివి – శ్రమ – చెప్ప శక్యమా ||ఆహా||
చరణము 5
"దప్పి గొనుచున్నాను" – అంచును – జెప్పితివి గదాఇప్పగించిరి బాధ నొంద – నేమి నీకు హా! ||ఆహా||
చరణము 6
శ్రమ ప్రమాదములను గొప్ప – శబ్దమెత్తి హా"సమాప్తమైనది" – అంచును దెలిపి – సమసితివి గదా ||ఆహా||
చరణము 7
"అప్పగింతును దండ్రి నీకు – నా ఆత్మ" – అంచునుగొప్ప యార్భాటంబు చేసి – కూలిపోతివివా ||ఆహా||