#195

క్రీస్తు శ్రమల ధ్యానము

రాగం: ముఖారి (ఛాయ: పాపము తలచు సుమీ) · తాళం: ఆది · రచయిత: గొల్లపల్లి నథానియేలు

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
ఎన్నడు గాంచెదమో – యేసుని – నెన్నడు గాంచెదమోయెన్నడు జూతుము – కన్నె కుమారుని – సన్నుతి జేయుచును ||నెన్నడు||
చరణము 1
అంధుల గాచెనట – యెహోవా – నందనుడ్రితడౌనటపొందుగ బాపాత్ములకొర – కై తన – ప్రాణము విడిచెనట ||యెన్నడు||
చరణము 2
వేసిరి సిలువనట – క్రీస్తుని – జేసిరి హేళననటద్రోసిరి యూదులట – బల్లెము – దోసిరి ప్రక్కనట ||యెన్నడు||
చరణము 3
చిందెను రక్తమట – పరమ – సంధులు దెల్పెనటనిందల కోర్చెనట – మన దగు – నేరము గాచెనట ||యెన్నడు||
చరణము 4
ఆపద కోర్చెనట – పాపపు – మోపులు మోసెనటకోపము మాన్పెనట – యెహోవా – కొడుకై వెలిసెనట ||యెన్నడు||
చరణము 5
అక్షయుడ్రితడైనట – జగతికి – రక్షకుడ్రాయెనటదీర్ఘము నమ్మిన నరులం – దరికి ని – రీక్షణ దేవుడట ||యెన్నడు||