#200
స్త్రీలు సిలువ చెంత ధ్యానించుట
పల్లవి · Pallavi
చేడియలు గుంపుగూడి – క్రీస్తు – జాడగని తాల్మి నిలిచిఅడికల నోర్చి నేడు మన పాలి – వాడు సిలువను – నున్నాడు గదయంచు ||చేడియలు||
చరణము 1
వారి మొగములు వాడెను – యేసు – వారి వెతలు ఎల్ల జూడెనునీరు దృక్సర – సీరుహము లందు – జార తమ కొన – గోరులను మీటి ||చేడియలు||
చరణము 2
రొమ్ములను చేతులుంచుచు – చింత – గ్రుమ్మి నిట్టూర్పులిచ్చుచుకొమ్మలట నిలుప – బొమ్మల చేష్ట – లెమ్ము చెడియలు – రవముతో నిల్చి ||చేడియలు||