#192

క్రీస్తు మరణ శ్రమల ధ్యానము

రాగం: ముఖారి (చేయ: ఎంతో దుఃఖము) · తాళం: అట · రచయిత: బేతాళ జాన్

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
ఐదు గాయములు ఒందినావా – నా కొరకు – ఐదు గాయములు ఒందినావాఐదు గాయముల నా – యాత్మన దలంప నా కారాట మెచ్చినదేనీ – మేన దిగె నావంటి – మర్త్యుల పాలేసి – మరణము నొందితివి గదే ||ఐదు||
చరణము 1
ఘోరమైన నీ శ – రీర రక్తములను – ధారయై కారినదా – నా – నేరమా యిదిభారమై నీ పైన – ఘోరమై యొరిగినదా ||ఐదు||
చరణము 2
అందమౌ నీ తనువు – కంది రక్త శ్వేద – బిందువులై రాలెనే – యీ – చంద మూహింప నా – డెందము తల్లడిల్లె – గొందలమై తూలెనే ||ఐదు||
చరణము 3
ఎల్ల పాపము మోయు – అల్ల దేవుని గొర్రె – పిల్లవు నీవే గదా – నా – వల్లనా నీ కింత – యల్లాట పుట్టెనే – చెల్ల తాళుదు నెట్ల నా యెద ||ఐదు||
చరణము 4
భంగమౌనట్టి దు – ష్టాత్ముల గావ నీ – ప్రాణ మర్పించితివా – యీ – సంగతి జూడ నీ – సాహస మింక నే – భంగి నీ జగతి మరవ ||నైదు||
చరణము 5
ఆయాసమైన నీ – యాపదలెల్ల నే – నాలోచింపగ నాత్మలో – నెడ – బాయక తద్దివ్య – పాదసరోజముల్ – భాసిల్లు నా యాత్మలో ||ఐదు||
చరణము 6
తల్లికైనా మరి – తండ్రికైనా నన్ను – దమ్ములకైనా లేదు – కన్న – పిల్లలకైనా నీ – ప్రేమ పోల్చుదు – నన్న – బృథివిలో గానరాదే ||ఐదు||
చరణము 7
ఈ ప్రీతి నీ యోర్మి – నీ మహత్యంబు బిల – నెవ్వ రూహింతు రొగి – నో – హౌప్రభువా తద్ద – యోత్కట గాంభీర్య – మూహింప నీకే తగు ||నైదు||