#191
సిలువ ధ్యానము
పల్లవి · Pallavi
ఎంతో వింత యెంతో చింత – యేసు నాధు మరణమంతపంతముతో జేసి రంత – సొంత ప్రజలు స్వామి నంత ||యెంతో||
చరణము 1
పట్టి కట్టి నెట్టి గొట్టి – తిట్టి రేసు నాధు నకటాఅట్టి శ్రమల నొంది పల్క – డాయె యేసు స్వామి నాడు ||యెంతో||
చరణము 2
మోయలేని మ్రాను నొక్కటి – మోపి రేసు వీపుపైనమోయలేక మ్రానితోడ – మూర్ఛబోయె నేసు తండ్రి ||యెంతో||
చరణము 3
కొయ్యపైన యేసయ్యను బెట్టి – కాలుసేతులలోన చీలల్కీటనులంత గూడి గొట్టిరి – ఘోరముగ క్రీస్తేసును పట్టి ||యెంతో||
చరణము 4
దాహముగొన జేదు చిరకను – ద్రావ నిడిరి ద్రోహు లకటాధాత్రీ ప్రజల బాధ కోర్చి – ధన్యుడు దివి కేగె నహహా ||యెంతో||
చరణము 5
బల్లెముతో ప్రక్కన బొడువన్ – పారె నీరు రక్త మహహాఏరై పారె యేసు రక్త – మెల్ల ప్రజల కెల్లమి నొసగు ||నెంతో||