#190

క్రీస్తు మరణము

రాగం: హిందుస్తానీ తోడి · తాళం: త్రిపుట · రచయిత: కొత్తపల్లి జాన్

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
ఆహా యెంతటి శ్రమల బొంది – వయ్యా – దాహమాయెను నీకు సిలువపైద్రోహులందరూ గూడి అయ్యయ్యో – నీదు – దేహంబు బాధించి రయ్యయ్యో ||ఆహా||
చరణము 1
దుష్కర్ములకు నప్పగించెనా – యూదా – ఇస్కరియోత నెడి శిష్యుడుతస్కరించిన వాని భంగిన నిన్ను – నిష్కారణముగాను పట్టిరా ||ఆహా||
చరణము 2
కలుషాత్ములందరూ గూడిరా – నిన్ను – బలువిధంబుల హింస బెట్టిరాతలపైన ముళ్ళ కిరీటముంచి యా – సిలువ నీతోనే మోయించిరా ||ఆహా||
చరణము 3
కాలుసేతులయందు వారలు – ఇనుప – చీలలు దిగగొట్టి రయ్యయ్యోజాలి సుమంతైనా జూపక – వారు – గేలిచేయుచు బాధపెట్టిరా ||ఆహా||
చరణము 4
బాధ తగ్గించు పరమాణువారలు – నీకు చేదు ద్రాక్షారసము ఇవ్వగానీదు మనసు దానినొల్లక గొప్ప – వేదనలను భరించెనే ||ఆహా||