#189
గాయపరచబడిన పరిశుద్ధ శిరస్సు
పల్లవి · Pallavi
వందనం నీకే వందనం – పరిశుద్ధ శిరమా – వందనం – నీకే – వందనంవందనం బొనరింతు నీ దా – నందమగు పుణ్య నామమునకై ||వందనం||
చరణము 1
సుందరుడ నీ శిరస్సు హేళన – బొందె ముండ్ల కిరీట ముంచగనెందెనందున జిమ్మిన రక్త బిందువులు – చిందుచుండెడి గాయములతో – గ్రంధెనా – మోము – కుందెనాఇంక నే – నెందు బోవక నిన్ను గొలిచెద – నందముగ మహిమ ప్రభావా ||వందనం||
చరణము 2
భీకరుడ నీ యెదుట సర్వ – లోకములు వణకెడు పుణ్యముఖమేఘ రణి నుమి వేయబడివి – కార రూపము నొందికందెను – శ్రీకరా – శ్రీశు – భాకరానే నీ ముఖ ప్రకాశము పాడుజేసితి – నో కరుణా భాస్కర క్షమించుము ||వందనం||
చరణము 3
మించు నీ ముఖ లక్షణము లహ – మంచి పెదవుల రంగ జూడగగొంచెమైనను గనుపడక కృ – శించి దౌడలు క్రుంగిపోవుటనెంచగా నాలో – జించగా ఆ నీ – యంచితపు బల శౌర్యములు హ – రించి పోయెను మరణ బలమున ||వందనం||
చరణము 4
సిలువ యెదుటను నిపుడు నే నిక – నిలిచి నిన్ను బ్రార్థింతు ప్రభువాఖలుడనని నన్ను ద్రోయకుము నే – నలసి సొలసి నిన్ను విడువకపిలిచెద – నిన్నే – గొలిచెద నీ తల – బలిమి చావున వాల్చగను నా – యేసు నిన్ను చేతులతో నా యెద ||వందనం||
చరణము 5
నిన్ను నే గొనియాడుటకు నిపు – డున్న భాషలు చాల వికనెన్నెటుల నే నుతియింతునో హో – సన్న రక్షక ప్రోవు నన్నెన్నెడ బాయకుఖిన్నుని – జేయకు నా కొర – కిన్ని బాధల నొందితివి నా – యన్న నా జీవంబు నీదే ||వందనం||
చరణము 6
మరణ దినమున భయము పడి నీ – కొరకు ఎదురు చూడం గృపతోవరబలుండ నా విరోధి – కరముకు శరముల ద్రుంచ రావెశూరుడా – దేవకు – మారుడా అటు నీ – మరణ రూపము సిలువపై నా – తరుణమున జూపుము యెహోవా ||వందనం||