#188

సిలువ ధ్యానము

రాగం: ముఖари · తాళం: త్రిపుట · రచయిత: పురుషోత్తము చౌదరి

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
చూడరే క్రీస్తుని చూడరే – నా సఖులారా – చూడరే క్రీస్తుని చూడరేచూడరే నా ముక్తి పదవికి – రేడు యేడు దశ గూడినాడో ||చూడరే||
చరణము 1
మించి పొంతి పిలాతు సత్యము – ఇంచకైన దలంప కక్కటవంచనను గొట్టించి యూదుల – మంచిదనమే కోరి అప్పగించెనామేలుగా – క్షమించెనా ఇతని గాంచి కాంచి భక్తులెట్లు సహించిరో పరికించి మాదిరి ||చూడరే||
చరణము 2
మంటికిని నాకాశమునకును – మధ్యమున వ్రేలాడుచుండగానంట గొట్టగా సిలువ మ్రాని – కప్పగించుట కొరకు నిన్ను గాంచెనాఇది మది – నెంచెనా అహనా కంటె నే ఇటువంటి యాపదన – గంటి బ్రాణము లుండునా ఇంక ||చూడరే||
చరణము 3
ఊటగా రక్తంబు కారుచు – నుండ బల్లెపు ప్రక్కపోటుమాటిమాటికిని జూడ దుఃఖము – మరలునే తలమీద ముళ్ళ కిరీటమాఇతనికి – వాటమా యూదులు – మోటులై బాహాటమున నీ పాట్లను గాటముగా జేసిరి ||చూడరే||