#193
సిలువమీది క్రీస్తు
పల్లవి · Pallavi
చూడరే సిలువను వ్రే – లాడు యేసయ్యనుపాడు లోకంబునకై – గోడు జెందె గదా ||చూడరే||
చరణము 1
నా చేతులు చేసినట్టి – దోషంబులే గదానా రాజు చేతులలో ఘోరంపు చీలలు ||చూడరే||
చరణము 2
దురితంపు దలపులే – పరమ గురుని శిరముపైనెనరు లేక మొత్తెనయ్యో – ముండ్ల కిరీటమై ||చూడరే||
చరణము 3
పరుగులెత్తు పాదములు – చేసిన పాపంబులుపరమ రక్షకుని – పాదములలో మేకులు ||చూడరే||
చరణము 4
పాపేచ్ఛతోడు గూడు – నాదు చెడ్డ పడకలేపరమ గురుని ప్రక్కలోని – బల్లెంపు పోట్లు ||చూడరే||