#185
సిలువ
పల్లవి · Pallavi
నపుడెలా రక్షకా దయ చూపినట్టి పా – పపు చిత్తమున నిష్ఠు – రపు సిలువ మానిపైన – ప్రభుని వేయుట కొప్పి ||నపుడెలా||
చరణము 1
యెరూషలేమును నూరి బయటను – దుఃఖకరమైన కలవరి మెట్టనుపరమ సాధుని సిలువ – పైన బెట్టి తత్పాద – కరమధ్యముల మేకు – లరుదుగ దిగగొట్టి ||నపుడెలా||
చరణము 2
చిమ్మె నిమ్మగ మేని రక్తము – దాని – నమ్ము వారల కెంతో యుక్తముమోము వాడి కెందమ్మి పూవువలె మస్త – కమ్ము వాలెను రక్తము జారి కనుపట్టె ||నపుడెలా||
చరణము 3
గడు దొంగ లిరువురిని బట్టిరి – ప్రభుని – కుడి యెడమలను సిలువ గొట్టిరిచెడుగు యూదులు బెట్టు – కడు బాధలను మరియ – కొడుకు కోర్చుకొని వారి – యెడ దయ విడడాయె ||నపుడెలా||