#186
సిలువపై క్రీస్తుని ప్రేమ
పల్లవి · Pallavi
ఏ పాప మెరుగని – యే పావన మూర్తి – పాప విమోచకుండనా పాలి దైవమా – నా పాపముల కొర – కై పాట్లు నొందినావా ||ఏ పాప||
చరణము 1
ముళ్ళతో కిరీట – మల్లి నీ శిరముపై – జలాటమున మొత్తిరాముళ్ళపోటుకు శిరము – తల్లడిల్లగ సొమ్మ – సిల్లిపోతివి రక్షకా ||ఏ పాప||
చరణము 2
కలవరి గిరి దనుక – సిలువ మోయలేక – కలవరము నొందినావాసిలువ నీతో మోయ – తులువలు వేరొక్కని – దోడుగా నిచ్చినారా ||ఏ పాప||
చరణము 3
చెడుగు యూదులు బెట్టు – పడరాని పాట్లకు – సుడివడి నడిచినావాకడకు కలవరి గిరి – కడ కేగి సిలువను – గ్రక్కున దించినారా ||ఏ పాప||
చరణము 4
ఆ కాల కర్మములు – భీకరంబుగ నిన్ను ఆ కొయ్యపై నుంచిరానీ కాలు సేతులు – ఆ కొయ్యకే నూది – మేకులతో గ్రుచ్చినారా ||ఏ పాప||
చరణము 5
పలువిధంబుల శ్రమలు – చెలరేగ తండ్రికి – నెలుగెత్తి మొరలిడితివాసిలువపై బలుమారు – కలుగుచుండెడి బాధ – వలన దాహమాయెనా ||ఏ పాప||
చరణము 6
బలిష్ఠుండగు బంటు – బల్లెమున నీ ప్రక్క – లీలపడ బొడిచినాడాఉల్లాసముగనట్లు – నల్ల నీరు బుంగగా – జలారెను గదా కోపము ||ఏ పాప||
చరణము 7
కటకటా పాప సం – కటము బాపుట కింత – పటుబాధ నొందినావాఎటువంటిది నీ ప్రేమ – యెటువంటిది శాంత – మెటుల వర్ణింతు స్వామి ||ఏ పాప||