#184

ఆశ్చర్యకరమైన సిలువ

రాగం: పున్నాగవరాళి (ఛాయ: ఎంతో సుందరమైనవి) · తాళం: త్రిపుట · రచయిత: పురుషోత్తము చౌదరి

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
ఏమాశ్చర్యము ప్రియులారా – క్రీస్తు మరణము – ప్రేమ జూడరే మనసారఆ మహాత్ముడు మరణ – మగు రీతి గనుగొన్న – సామాన్యమగు నొక్క జనని కంటె గాదు – ఈ మహిని గల పాప జీవులపైన మహా కృప జూపి నిత్య – క్షేమ మొసగెడు కొరకు బలు శ్రమలచే మృతుడైనాడడు స్వేచ్ఛను ||ఏమాశ్చర్యము||
చరణము 1
కొండవలె భారమై – లోక పాపములు – దండించబడె ఘోరమైనిండు భారము క్రింద – నిలుచున్న వేళను – గుండె దిగులున దనువు – నిండె రక్తపు చెమటమెండుకొని దుఃఖములతో నా – తండ్రి యీ పాత్రను నా కడ – నుండి తొలగించుటకు మనపైన – యుండినను చేయమని వేడెను ||ఏమాశ్చర్యము||
చరణము 2
కడు దుర్మార్గులచేతను – క్రీస్తుడు పట్టు – పడె దానంతట తానుచెడుగు లెందరు నింద – చేసి మోముపై ఉమ్మివేసి – వడి ముళ్ళతో నల్లి – బడిన కిరీటముతడయక కౌదలు బెట్టి కరముల – నడుగులను సిలువ నిడి మేకులు – దొడిపి ప్రక్కను రక్త జలములు – దొరగ గుంతము గ్రుచ్చిరహహా ||ఏమాశ్చర్యము||
చరణము 3
ఇరు పార్శ్వముల నిద్దరి – దొంగలనుంచి – మరణావస్థల బెట్టిరినిరపరాధి ప్రభువు – దురితాత్ము లొనరించు – తరుచు బాధల కోర్చి – మరి వారి గమనించియెరుంగరై రేమి యునర్చున్నారో యీ – దురిత జీవులు వీరి – నోహో పరమ జనక క్షమించుమని తన – యరుల కొరకై వేడుకొనియెను ||ఏమాశ్చర్యము||