#183

క్రీస్తు సిలువ

రాగం: ముఖారి (ఛాయ: ఎంతో దుఃఖము బొందితివా) · తాళం: త్రిపుట

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
సిలువను మోసితివా – నా కొరకై – కలవరి మెట్లపైకిసిలువ నా యాత్మలో – బలుమారు తలంపగా – దారిమి లేదాయెను – హాయి జాలికి మారుగా – నేనేమి చేయుదు – ప్రేమను మరువజాల ||సిలువను||
చరణము 1
ఘోరమైనట్టి యీ – భారమైన సిలువ – ధరించి భుజముపైనినా – దురితములు బాపను – కరుణచే జనుదెంచి – మరణము నొందితివా ||సిలువను||
చరణము 2
కలవరి మెట్లపై – కాలు సేతులెల్ల – చీలలతో గ్రుచ్చిపట్టియా – సిలువకు గొట్టగా – విలువైన నీ మేని – రక్తము ప్రవహించెనా ||సిలువను||
చరణము 3
మెట్లపైన నిన్ను – పెట్టిన బాధ నే – బట్టి తలంపగనుఆహా పట్టెను నీ ప్రేమ – నెటుల మరుతును – కష్టములు గలిగినను ||సిలువను||
చరణము 4
పంచ గాయములను – నెంచి యాత్మలోన – నుండి తలంపగనుహా నా – మించిన దురితములు – ద్రుంచి నన్నెంచిన – క్షమింప వచ్చెను భూమికి ||సిలువను||