#180

క్రీస్తు సిలువ బాధ

రాగం: గాంధారి · తాళం: ఏక · రచయిత: మిక్కిలి సమూయేలు

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

చరణము 1
4. ముళ్ళతోడ నొక కిరీట – మల్లి ప్రభు తలన్ బెట్టి – రెల్లు కఱ్ఱతో నా – కల్ల జనములురాలిల్లుమనుచు గొట్టి నవ్వి – గొల్లు బెట్టిరా ||మనసా|| 5. మోయలేక సిలువ భారము – మూర్ఛబోయెనా – అయ్యయ్యో జోక్కెనా – యేసయ్య తూలెనామా యయ్య నిన్ దలంప గుండె – లదరి పోయెనా ||మనసా|| 6. కాలు సేతులన్ గుదించి – కలవరి గిరిపైన నిన్ – గేలి చేయుచు – నీ కాలి మీదినుండిఇనుప చీలలతో గ్రుచ్చి నిన్ను – సిలువ గొట్టిరా ||మనసా|| 7. దేవ సుతుడ వైతివేని – తీవ్రంబుగా దిగి – నీవు వేగమే – రమ్ము గావుమనుచునుఇట్లు గావించి పల్కు పగరకు – కరుణ జూపెనా ||మనసా|| 8. తనను జంపు శత్రువులకు – దయను జూపెనా తన – నెనరు జూపెనా ప్రభుడు – కనికరించెనాఓ జనక యీ జనుల క్షమియించు – మనుచు వేడెనా ||మనసా|| 9. తాళలేని బాధల చేత – దాహమాయెనా – నమ్మినేలినవానికి – నా పాలి స్వామికినే నేల పాపములను చేసి – హింస పరచితి ||మనసా|| 10. గోడు బుచ్చి సిలువపైన – నేడు మారులు – మాటలాడి ప్రేమ తో – నా నాటి శిరమునువంచి నేడు ముగిసె సర్వ మనుచు – వీడె బ్రాణము ||మనసా|| 11. మరణమైన ప్రభుని జూసి – ధరణి వణకెనా – బలిగిరులు పగిలెనా – గుడి తెరయును – చిరిగెనాదివాకరుడు చీకటాయె మృతులు – తిరిగి లేచిరి ||మనసా|| 12. ఇంత జాలి ఇంత ప్రేమ – ఇంత శాంతమా – నీ యంతః కరుణను – నే చింత చేయగనీ వింత లెల్ల నిత్య జీవ – విధము లాయెనా ||మనసా||