#181
క్రీస్తు శ్రమల ధ్యానము
పల్లవి · Pallavi
రాజులకు రాజైన యీ – మన విభుని – పూజసేయుటకు రండిఈ జయశాలి కన్న – మన కింక – రాజేశ్వరులు లేరని ||రాజులకు||
చరణము 1
కరుణగల సోదరుండై – యీయన – ధరణి కేతెంచెనయ్యాస్థిరముగా నమ్ముకొనిన – మన కొసంగు – వరలోక రాజ్యంబును ||రాజులకు||
చరణము 2
నక్కలకు బొరియలుండె – నాకాశ – పక్షులకు గూళ్ళుండెనుఒక్కింత స్థలమైనను – మన విభుని – కెక్కడ లేకుండెను ||రాజులకు||
చరణము 3
అపహాస్యములు చేయుచు – నాయన – యాననము పైన ఉమియుచుకృప మాలిన సైనికు – లందరును – నెపము లెంచుచు గొట్టిరి ||రాజులకు||
చరణము 4
కరమునందు ఒక రెల్లు – పుడకను – స్థిరముగా నుంచి వారల్ధరణిపతి శ్రేష్ఠుడా – నీకిప్పుడు – దండ మనుచును మ్రొక్కిరి ||రాజులకు||
చరణము 5
ఇట్టి శ్రమలను బొందిన – రక్షకుని – బట్టుదలతో నమ్మినఅట్టహాసముతోడను – వరలోక – పట్టణంబున జేర్చును ||రాజులకు||
చరణము 6
శక్తిగల రక్షకుండై – మన కొరకు – ముక్తి సిద్ధము జేసెనుభక్తితోడ బ్రార్థించిన – మన కొసగు – రక్తితో నా ముక్తిని ||రాజులకు||
చరణము 7
త్వరపడి రండి రండి – యీ పరమ – గురుని యొద్దకు మీరుదరిని జేరిన వారిని – యీ ప్రభువు – దరుమ డెన్నడు దూరము ||రాజులకు||