#179

సిలువ యెదుట హృదయవేదన

రాగం: ధన్యాసి · తాళం: ఆది · రచయిత: పురుషోత్తము చౌదరి

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

చరణము 1
ఒక తోట లోపల – నాడు నీవు పడిన – సకల శ్రమలిచ్చోట – నికటమై యున్నట్లుగా – నిట్టూర్పులతో – దలంతునకట నా రాతి గుండె – శకలమై పోవునట్లుగా ||నా యన్న||
చరణము 2
పరమాశ్చర్యము గాదా – ఈలాటి ప్రేమ – ధరణిలో నున్నదాచురుకు ముళ్ళు పోటుకు నీ – శిరము నా వంటి నీచుని – పురుగు కొరకు అర్పించిన నీ – కరుణన్ దర్శింతు నేడు ||నా యన్న||
చరణము 3
ఇచ్చక మిది గాదు – మిగుల దలపోయ – ముచ్చట దీరదుఅచ్చి వచ్చిన నా – యవతారుడ నీ ప్రక్క – గ్రుచ్చు గాయము లోపలనే – జొచ్చి నీ ప్రేమ జూతు ||నా యన్న||
చరణము 4
తల వంచి సిగ్గున – నే జేయు నేర – ముల నెంతు నాలోనబలు మారు నీ గాయముల – గెలికి నిన్ శ్రమపరచు నా – ఖల దోషములకై యిప్పుడు – విలపించి వేడుకొందు ||నా యన్న||