#178

ఆయన అప్పగించబడిన రాత్రి

రాగం: అసావేరి · తాళం: రూపకము · రచయిత: పురుషోత్తము చౌదరి

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
ఆ యంధకారపు – రేయిలో క్రీస్తు పడు – నాయాసములు దలచరేసాయంతనము శిష్య – సమితితో భోజనము – చేయగూర్చున్న ప్రభువు – భక్తుల కనియె ||ఆ యంధ||
చరణము 1
ఒకడు మీలో నన్ను – యూద గణముల చేత – లకు అప్పగించ దలచెన్ – ముఖస్తుతి గలుగు – మూర్ఖుడగు యూదాను – మొనసి వీడనుచు దెలిపి యింకమిమ్ము గూడియుం – డకయుందునని రొట్టె – విరిచి స్తోత్రంబు జేసి – ప్రకటముగా దీని భక్షించుడని పిదప – నొక పాత్ర చాచ ఇచ్చెన్ – ద్రాక్షారసము ||ఆ యంధ||
చరణము 2
తన మేని గుర్తు రొ – ట్టెను జేసి పాపవి – మోచనమైన రక్తమునకు – నొనరంగ ద్రాక్షార – మును గుర్తుగా దెలిపి – నెనరుగల కర్త యప్పుడు – చనె గెత్సేమనే వన – స్థలిలోన శిష్యు – లుండగ దా నొక్కరుండు – మనసు వ్యాకులము చే – తను నిండియుండగా – పుణ్యుడు ప్రార్థించె తండ్రిని – గాఢముగాను ||ఆ యంధ||
చరణము 3
శ్రమచేత దన శరీ – రము నుండి దిగజారె – చెమట రక్తపు బొట్లుగా – నమితమౌ లోకపా – పము గని నిట్టూర్పులప్పటప్పటికి బుచ్చి – క్రమముగా దూత తన – కడ కరుగుదెంచి శాం – తము పల్కి చనినపిదప – తను మనంబుల బోలు – తమమున యూద సై – న్యము లేగుదెంచె నప్పుడు – గెత్సేమనే వనికి ||ఆ యంధ||
చరణము 4
పరశాంతి శీల స – ర్వజ్ఞతలు గల ప్రభుం – డెరిగి తనకునఫ్ల పాట్లు – పరిపంధి గణముతో – బలికె మీరిచ్చోట – నెరయుచున్నారే వెన్నుని – నరులు జన రేత యే – సను వాని నన్నగ దా – నెరిగింప నేనే యనియుగురు దీప శిఖల సో – కు పతంగముల భంగి – ధరణిపై బడిరి వారల్ – దర్పము లణగి ||ఆ యంధ||
చరణము 5
తన శిష్యులను విడువ – డని రిపులచే దానే – పట్టుబడెనైన కనిపి – పేతురు యాజ – కుని దాసు కర్ణంబు – దునుమంగ క్రీస్తుండపుడు – కనికరంబున స్వస్థ – తను జేయు నా విభుని – కరములను విరిచి కట్టి – వెనుక ముందర జుట్టు – కొని యెరూషలేము పుర – మునకు దీసుకొని పోయిరి – రాణులవారు ||ఆ యంధ||