#177

క్రీస్తు తన శ్రమలను గూర్చి ప్రవచించుట

రాగం: ఆనందభైరవి · తాళం: అట · రచయిత: పురుషోత్తము చౌదరి

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసు శిష్యులకు – నెరుక జేసిన – భవిష్యోక్తులు వినరేకైసరయనబడు – ఘోర ప్రాంతములను – పుణ్యుడు చేరి తన – గతి మతి దలచుచు ||యేసు||
చరణము 1
యెరూషలే మనెడి – పురమున దనకు – గలుగు దుఃఖములుదురితాత్ములు యూ – దులు కడు బాధలు – పరచి తనను సిలువ – మను చంపుదురని ||యేసు||
చరణము 2
నీతి బోధకులకు – నాయకులు పెద్దలు – ఖ్యాతిగ నర్చకులుఅతని దననప్పుడు – హాస్యము లాడుచు – బోతరించి యుమి – వేతు రటంచును ||యేసు||
చరణము 3
మనుజ కుమారుడు – మరణమై సమా – ధి వేయంగబడునుదనరుగ మూడువ – దినమున బునరు – త్థానమై యుందు గా – దర్శన మిడుదు మీకని ||యేసు||