#175
క్రీస్తు ప్రేమ సాటిలేనిది
పల్లవి · Pallavi
ఏమి లేదు సుమీ జగములో యేసుని – ప్రేమ సారము కన్ననుపామరంబేటికి వృథా కనుదామరలు మూయగనే చీకటి – యాత్మల నెల్ల సత్యము – గామి గని సర్వంబు విడువుము ||రేమి||
చరణము 1
దార పుత్రాది బంధు శ్రేణిపై మమ – కార భావము జెందుచుతద్విషయమై – కోరి దుఃఖము లొందుచు – భ్రమ గొందుచు భూరిమాయాజాల బంధా – కారమిది యని తెలియక సం – సారమంతయు నాది నాదని – యూరకే చెడిపోవ నేటికి ||నేమి||
చరణము 2
ఈ దేహమునకు బ్రాణమునకు సంబం – ధము ఇంచకైనా గలదాదేహాత్మలకు – భేదము గనవలదా – బుద్ధి గొనవలదాయాది నా దేహము – నా ఆత్మ స – మాదరంబున నుండునా తనదు – గద్దె ధరిత్రిని విడిచి చనునప్పుడే దయామృతవార్ధి దిక్కగు ||నేమి||
చరణము 3
జాయా పుత్రోద్యాన గృహ వితా వితానములక – సకల వస్తుజాలముప్రతిష్ఠాను – భూతి విద్యలు – నిఖిల సంపదలునీ యవని లోపల సమర్పణ – జేయగ బడు గాని ఇంచుక – తోయమును కొని పోవ శక్యము – లేదు హా భ్రమ నొంద నేటికి ||నేమి||