#174

యేసు మన ప్రియబంధువు

రాగం: అహిరి · తాళం: ఆది · రచయిత: పురుషోత్తము చౌదరి

Category: క్రీస్తు జీవితము — ఉపదేశములు · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసు వంటి ప్రియబంధుడూ నాకు ఇంక – నిహపరములలో లేడనల్లాభాసురముగ నిజ భక్తుల కిది యను – భవ గోచర మెప్పుడు నన్ను ||యేసు||
చరణము 1
ఊరు పేరు పరువులు మురువులు మరి – యూడ గొట్టబడినను గానికూరిమితో క్రీస్తుడు మా కుండగ – కొదువ రాదు గొప్పయు పోదు ||యేసు||
చరణము 2
పాడికలు తిరస్కారంబులు మా – కవమానములున్నను గానితోడు క్రీస్తుడు మా కుండినను త్రోవ – దప్పము ఓడిపోము ||యేసు||
చరణము 3
తగ్గుపాట్లును సిగ్గుపాట్లును – తలపై మెండుగ వాలినగానిదగ్గర మా పాలిట ప్రభువుండగ – సిగ్గును బొందము తగ్గున గొందము ||యేసు||
చరణము 4
ఎన్నెన్నో శోధన బాధలు చెల – రేగి మనలను జుట్టినప్పుడుకన్న తండ్రివలె నోదార్చుచు దన – ఘన వాగ్బలమున దనువును వానిని ||యేసు||
చరణము 5
మనసు క్రుంగి పలు చింతలచేత – మెట్టబడిన వేళను మాకుతన వాగ్దాతములను చేతుల లే – వెత్తి యెంతో సంతసమొసగును ||యేసు||
చరణము 6
తల్లిదండ్రులు విడిచిన గాని – తాను వదలడు ఎప్పుడు మమ్ముఉల్లము నెత్తి పిలిచిన వేళ – నోహో యనుచు దరికి వచ్చు ||యేసు||
చరణము 7
అతడుండే పరమండలము ఇక – వెదకిన గాని అగపడదుక్షితి నాథుడు మా మతిని వసించిన – అతులిత సౌఖ్య మదియే మోక్షము ||యేసు||