#173

యేసుని ప్రేమ స్మరణ

రాగం: శంకరాభరణము · తాళం: ఆది · రచయిత: దొరస్వామి ఆరోగ్యం

Category: క్రీస్తు జీవితము — ఉపదేశములు · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసుని ప్రేమను – నేమరకను – నెప్పుడు దలచవే యో మనసావాసిగ నతని – వర నామంబును – వదలకు పొగడవే యో మనసా ||యేసుని||
చరణము 1
పాపుల కొరకై – ప్రాణము బెట్టిన – ప్రభునిల దలచవే యో మనసాశాపము నంతయు – చక్కగా నోర్చిన – శాంతుని పొగడవే యో మనసా ||యేసుని||
చరణము 2
కష్టములలో మన – కండగనుండిన – కర్తను దలచве యో మనసానష్టములన్నియు – నణచిన యా గురు – శ్రేష్ఠుని పొగడవే యో మనసా ||యేసుని||
చరణము 3
మరణతరిని మన – శరణుగ నుండెడి – మాన్యుని దలచవే యో మనసాకరుణను మన కన్నీళ్ళను తుడిచిన – కర్తను పొగడవే యో మనసా ||యేసుని||
చరణము 4
ప్రార్థనలు విని – ఫలముల నొసగిన – ప్రభునిగ దలచవే యో మనసావర్ధన గోరుచు – శ్రద్ధతో దిద్దిన – వంద్యుని పొగడవే యో మనసా ||యేసుని||
చరణము 5
వంచన లేక – వరముల నొసగిన – వరదుని దలచవే యో మనసాకొంచెము కాని – కూరిమితో దేవుని – కుమారుని పొగడవే యో మనసా ||యేసుని||