#172

యేసే మన సమస్తము

రాగం: నవరోజు · తాళం: ఆది · రచయిత: గొల్లపల్లి నథానియేలు

Category: క్రీస్తు జీవితము — ఉపదేశములు · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసుక్రీస్తు దొరికె నేని – యేమి కొదువ ఇంకేమి భయముదోషకారి జనుల కెంతో – గ్రాసమవునా యేసు పేరు ||యేసు||
చరణము 1
తల్లిదండ్రులకన్న చాలా ధన ప్రేమ మనమీదనెలకాలమునందునుంచు – యేసుడే మా తండ్రియౌను ||యేసు||
చరణము 2
వలనుగాని వశములేని – యెల్ల మేళ్ళన్నిటినెల్లప్పుడు ము కలగా మన కిచ్చెడి దేవ – కుమారుడే వేరెవరూ లేరు ||యేసు||
చరణము 3
దండయైన గండములు – మెండుగాను మమ్ము జుట్టినతండ్రివలె మా దరికి వచ్చి – గండములను గదిమి బ్రోచున్ ||యేసు||
చరణము 4
సత్యము మార్గము తానే – నిత్య జీవమింక తానేమృత్యువుల మనకీయ – మోక్షము – భువిని రక్తమంత గారె ||యేసు||
చరణము 5
ఎన్నరాని పాపాత్ముల – కన్నులార కనికరించిపుణ్యమైన తన ప్రాణము – భువిని బలిబెట్టినాడడు ||యేసు||
చరణము 6
ఒడలు నిండ గాయములతో – నడరుచుండ మరల లేచివెడలి పరమందునుండి – వేడుకలు మాకు జూపినాడు ||యేసు||
చరణము 7
ఆశతోడ తనను నమ్ము – యాత్మలకు దర్శనమిచ్చెడియేసుతో నింకెవరు సాటి – లేశమైనా లేరు సుండో ||యేసు||