#171
యేసుని గొప్ప ప్రేమ
పల్లవి · Pallavi
యేసూ నన్ను ప్రేమించినావు – పాపినైన – నన్ను ప్రేమించినావు ||యేసూ||
చరణము 1
నన్ను ప్రేమింప మానవ రూపమెత్తితివా – నవయుగము జీవము సిలువపై నిచ్చికన్న తల్లిదండ్రుల – అన్నదమ్ముల ప్రేమ – కన్న మించిన ప్రేమతో ||యేసూ||
చరణము 2
తల్లి గర్భమున నే – ధరియింపబడినప్పుడే – దురితుండనై యుంటినినా వల్ల జేయబడెడు – నెల్ల కార్యము లెప్పుడు – హేయంబులై యుండగా ||యేసూ||
చరణము 3
మంచి నాలో బుట్ట – దంచు నీ వెరిగియున్నన్ – మించ ప్రేమింతి నావుఆహా యెంచ శక్యముగాని – మంచి నాలో బెంచ – నెంచి ప్రేమించినావు ||యేసూ||
చరణము 4
నన్ను ప్రేమింప నీ – కున్న కష్టము లన్ని – మున్నై తెలిసియుంటివితెలిసి నన్ను ప్రేమింప నీ – కున్న కారణ మేదో – యెన్న తెలియదు చిత్రము ||యేసూ||
చరణము 5
నా వంటి నరుడొక్కడు – నన్ను ప్రేమించిన – నావలన ఫలము గోరుఆహా నీవంటి పుణ్యునికి – నా వంటి పాపితో – కేవలం బేమి లేక ||యేసూ||