#170
క్రీస్తుని దయ
పల్లవి · Pallavi
యేసుక్రీస్తు ప్రభువా – మేము నీ – మోక్షమును బొందుటకుదోషపు లోకము – లోనికి వచ్చితివి – దోషులను బ్రోచుటకు ||యేసు||
చరణము 1
పరిశుద్ధుడవు నీవు – ఇలలో – పాపుల నందరినిపరిపరి విధ – కృప – వాక్కులతోడను – పిలిచితి వెల్లప్పుడు ||యేసు||
చరణము 2
సత్యపు నడతలతో – జగతిని – సర్వాద్భుతములనునిత్యము చేయుచు – నీ కృప చాల – ఇలలో దెల్పితివే ||యేసు||
చరణము 3
అతి పుణ్యాత్ముడవే – క్షితిలో – వెతలను బొందితివేమృతిని బొందియు – దురిత వితతి దూర – నమ్మిన – దురితుల స్నేహితుడానిరతము మమ్మును – నీ కృప లోపల – నిలకడగా బెంచుము ||యేసు||
చరణము 4
నోరు నిండ నెదలో – నీ కృప – ప్రేరణగలిగిసారెకు వేడెద – ముక్తికి రక్షణ – కారకుడా నిన్ను ||యేసు||