#169
పాపికి యేసే ఆశ్రయుడు
చరణము 1
2. అజ్ఞాన నాశన ప్రద్యుమ్నుడవు నీవేవిజ్ఞాన దాయక పరమ గురువు నీవే – యేసు నీవే ||పాపి|| 3. చెదరిన పాపుల వెదకెడు నీవేచెదరిన గొర్రెల కాపరివి నీవే – యేసు నీవే ||పాపి|| 4. రోగిష్ఠులకు స్వస్థ ప్రదాతవు నీవేమ్రోగు నార్తుల యొక్క మొర విను నీవే – యేసు నీవే ||పాపి|| 5. నర పుత్రులకు నీతి గరపించు నీవేకరము చాపి కష్టములు ద్రోయు నీవే – యేసు నీవే ||పాపి|| 6. శాత్రవాంతరమున మృతుడవు నీవేమైత్రి జూపగా మృత్యుంజయుడవు నీవే – యేసు నీవే ||పాపి|| 7. భవదీయ పదకంజ దాసుండ నేనేభవమగ్ను నన్ను ముక్తు జేయుము నీవే – యేసు నీవే ||పాపి||