#168

పాపికి క్రీస్తే ఆశ్రయము

రాగం: అసావేరి (ఛాయ: ఉన్నపాటున) · తాళం: త్రిపుట · రచయిత: రావూరి రంగయ్య

Category: క్రీస్తు జీవితము — ఉపదేశములు · Open in the hymnal app

పల్లవి · Pallavi
పరమ రక్షక యేసు – ప్రభువా నే నీ పాల పడితి పాలన సేయవేధరణి జనంబులు చేయు బహువిధ – దురితములు క్షమియించి సద్గతితెరువు జూపి తరింపజేసెడి – దొరవటంచును మరుగు జొచ్చితి ||పరమ||
చరణము 1
క్షితి ఇసుక తీరముపై కతయైన నెన్ననౌ – ఇతియౌను లెక్కింపగాకుతల జన్మంబెత్తి నేను ఈ యటు – బ్రతుకు దినముల – జేయు నఘములు – మతి దలప నిమిత్తము యూతంబులు – పతితుడను నా గతి యెరుంగను ||పరమ||
చరణము 2
పసలేని మాయా దురవ్యాసనంబులను – జెంది – దెస దప్పియున్నాడనువసుధలో దుష్టునికి లోబడి – మసలజాలని బలహీనత – గసటు కన్నులగప్పి కడు మా – నసము ధూళి విలపించెద నైతిని ||పరమ||
చరణము 3
మదితప్పి గొర్రెల – మంద బాసిన గొర్రె – చెదరి చలించినట్లువదలకు యెప్పుడు దురాత్ములైరి స – ముదయమున పడి తిరిగి నడచితి – మదికి విశ్రమమేమియు లేమిని – హృదయ సంతాపముల సుడివడి ||పరమ||
చరణము 4
మదపు నాగము భంగి – మత్తిల్లి దుర్భావ – హృదయుడనై చెడితినిగొదగొనుచు గాయములతో నా – యెద దృఢంబు ఇంకను యేమియు లేమిని – గదల శక్యము గాక మూల్గుచు – గొదవలకు లోనైతి ద్రోహిని ||పరమ||
చరణము 5
అమిత దురాత్ముడ – నని కడ ద్రోయక – క్షమియింపుమా కరుణచేతమిని మిక్కిలి దుర్విషయగుణ సముద్రంబులు జుట్టి పాపపు – తమము గప్పియు కలుష కానన – సమితిలో పడి శ్రమలు నొందుచు ||పరమ||