#167
క్రీస్తుని అద్భుత ప్రేమ
పల్లవి · Pallavi
ఓ వింత! నా రక్షకుడా నాకై – నీ విలువ రక్తము కార్చితివాజీవాధిపతి మృతి జెందె నహహా పురుగు – వంటి నాకై నీ – జీవమర్పించి నావా ||ఓ వింత||
చరణము 1
నేను చేసిన పాపములకు నాయన – మ్రానుమీద మూలిగినావానేను గ్రహింపలేని – నీ జాలి కరుణ మితి – లేని ప్రేమ దీన్ని – వలనను కనుపడుచునున్నది ||ఓ వింత||
చరణము 2
పరమ శరీరుడు తాను – మరణ రక్తము చేత – కరుణతో నన్ను బ్రోచినాడుమరుతునా యీ ప్రేమ నా – మరణంబునందు సహ – కర్త కటాక్షములు – కలకాల ముండు నాతో ||ఓ వింత||
చరణము 3
నా యేసు నాథ నీకు – నేనిచ్చియున్నదెల్ల – నా లేమితో బ్రేమ గదానియమముగల ప్రభువా – నీ కెట్లు చెల్లించెదను – నన్ను నేనే నీకు – నర్పించుకొనుట గాక ||ఓ వింత||