#166

పాపియెడల యేసు ప్రేమ

రాగం: యదుకుల కాంభోజి (ఛాయ: ధరణిలోని ధనము) · తాళం: ఆది · రచయిత: చదలవాడ థామస్

Category: క్రీస్తు జీవితము — ఉపదేశములు · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసు రాజా నీదు ప్రేమ – నెంచ తరము గాదయ్యాదోషియైన నన్ను బ్రోవ – నీ సుప్రాణ మిడితివా ||యేసు రాజా||
చరణము 1
మంచివాని కొరకు నొకడు – మరణమొందుటరుదుగాఅంచితమగు ప్రేమ చేత – మించి గాయములు ఒందినావు ||యేసు||
చరణము 2
అయ్యో మ్రానుమీద నీవు – ఇయ్యకొని మోసితివా ||యేసు||
చరణము 3
గెత్సేమనే వనములోకి – జొచ్చి తండ్రి చిత్తమైఇచ్చిన నా శ్రమల పాత్రన్ – బుచ్చుకొని భరించితివా ||యేసు||
చరణము 4
హస్తము, పాదము, ప్రక్కలు – మస్తకపు గాయములలోవిస్తరించి చిందె నీ ప్ర – శస్త రక్తమంతయున్ ||యేసు||
చరణము 5
కొండమీద నిన్ను జూడ – గుండె లదిరిపోవునయ్యానిండు ప్రేమ చేత నా వలగ – మెండూ బాధల నోర్చినావు ||యేసు రాజా||
చరణము 6
మరువలేను నీదు ప్రేమ – మరణ పర్యంతంబు నానరక బాధలన్ని నీవు – కొరతపై వహించినావు ||యేసు రాజా||
చరణము 7
నిన్ను దలచ నా నిరీక్షణ – యున్నతముగా నుండునుయెన్నడు నీ మహిమను నా – కన్నులార జూతునో ||యేసు రాజా||