#165
యేసుని నిరుపమాన ప్రేమ
పల్లవి · Pallavi
ఈలాటిదా యేసు ప్రేమ – నన్ను – తూలనాడక తనదు – జాలి జూపినదా ||ఈలాటిదా||
చరణము 1
ఎనలేని పాప కూపమున – నేను – తనిసి మునుగుచు నే – దరి గానక యుండన్కనికరము బెంచి నా యందు – వేగ – కొనిపోవ నా మేలు – కొరకు ఇందు వచ్చె ||ఈలాటిదా||
చరణము 2
పెనుగొన్న దుఃఖాబ్ధిలోన – నేను – మునిగి కుములుచు నేడు – పున గుందునప్పుడునన్ను నీచుడని త్రోయలేక – తనదు – నెనరు నాకు గనపరచి – నీతి జూపించె ||ఈలాటిదా||
చరణము 3
నెమ్మి వర వింతైన లేక – చింత – క్రుమ్మి పొగలుచునుండ – గా నన్ను జూసిసమ్మతిని నన్ను బ్రోవ దలచి – కరము – చాచి నా చేయి పట్టి – చక్కగ బిలిచే ||ఈలాటిదా||
చరణము 4
పనికిమాలిన వాడనైన – నేను – కనపరచు నా దోష – కపట వర్తనముమనసునుంచక తాపపడక యింత – ఘనమైన రక్షణ – మును నాకు జూపె ||ఈలాటిదా||
చరణము 5
నా కోరిక లెల్ల సమయములందున్ – క్రింది – లోక వాంఛల భ్రమసి – లొంగెడు వేళన్చేకూర్చి దృఢము చిత్తమునన్ – శుభము – నా కొసంగె జీవింప – నా రక్షకుడు ||ఈలాటిదా||
చరణము 6
శోధనలు నన్ను జుట్టినప్పుడు – నీతి – బోధ నా మనసులో – బుట్టించి పెంచిబాధలెల్లను బాపి మాపి – యిట్టి యాదరణ జూపెనా యహహ యేమందు ||ఈలాటిదా||