#164
ఆశ్చర్యకరమగు క్రీస్తు ప్రేమ
పల్లవి · Pallavi
ఈయనె నా యేసు రక్షకుడు – తన – దాయమని రక్షింప – దలంచెనా నన్నుఈయనె నా యేసు రక్షకుడు – ఆయాసమగు నొక్క మోపు – నే – మోయలేకుండ నా – మూపుపై నుండ – శ్రేయస్కరపు సిలువ జూపి – నాకు – హాయి నిచ్చెను భార – మంత వెడలించి ||ఈయనె||
చరణము 1
దురితాత్ముడనని త్రోయకుండ నన్ను – పరిశుద్ధుడగ యేసు – ప్రభుడు కరుణింపధరణిలో నిది మహాద్భుతము – నే – మరుతునా యీ ప్రేమ – మరణమౌ దాక ||ఈయనె||
చరణము 2
ఓర్పుగూడని దుష్కృతంబుల – నేను – తప్పక చేసి – ద్వేష్టినై యుండగోప మింతైనా రానీక – నన్ను – గాపురుషుడని తాను – ఖండింపడాయె ||ఈయనె||
చరణము 3
మనస్తాప గుణము లెడబాపెన్ – నా – దినకరోదయమట్లు – దీప్తిమిది మించెన్తన పాదముల జాడ లబ్బెన్ – సదా – వినుతి కెక్కిన వాని విమలాత్మ వెలుగు ||ఈయనె||
చరణము 4
హతుడయ్యె నా యేసు నాకై – దు – గ్గతి తొలగి నాకు మో – క్షమే గలుగు కొరకుఅతి దయా దీర్ఘశాంతుడె – దైవ – సుతుడని యెరిగితి – శోధింపగాను ||ఈయనె||
చరణము 5
నుతింపదగినట్టి యతని సిలువ – నా – జీవాంతమగు దనుక – చెలగి మోయుచునుఈ వసుంధర జనులకెల్ల మీరు – సేవించుడ యేసని – చెప్పి చాటెదను ||ఈయనె||