#163

యేసు గొర్రెల మంచి కాపరి

రాగం: పంతువరాళి · తాళం: చాపు · రచయిత: పురుషోత్తము చౌదరి

Category: క్రీస్తు జీవితము — ఉపదేశములు · Open in the hymnal app

పల్లవి · Pallavi
ఇడుగో గొర్రెల కాపరి – సోదరులారా – ఇడుగో గొర్రెల కాపరికడగా నరాని – కారడవిలోన నలసట – పడెడి గొర్రెలను – పేరిడి బిలిచి రక్షించు ||ఇడుగో||
చరణము 1
చెదరిపోయిన గొర్రెనై – దొడ్డికి బోవ – ముదము లేనివాడనైమృదు మధురంపు నీ – నాద మాలించక కర్త – కొదగి యుండక మూఢ – హృదయుడనైతిని ||ఇడుగో||
చరణము 2
దూరంబునకు బోతిని – జనకుని కృపా – సారంబు గొననైతినికారు మూర్ఖపు పిల్ల – గా సంచరించినా – కూరిమి ఇల్లు బాసి – దారి దొలగిపోతి ||ఇడుగో||
చరణము 3
తనదు గొర్రెను గాంచెను – బోయుడు తండ్రి – తన శిశువును గాంచెనుకనికరమెద నిం – డినవారలై నన్ను – వన గిరికటక కాదూ – లను వెంబడించిరి ||ఇడుగో||
చరణము 4
ప్రాణావసర మప్పుడు – ఏకాకినై – క్షీణించియున్నప్పుడుత్రాణార్థమగు – నేనరు త్రాళ్ళతో నన్నుగట్టి – నాణెముగా దెచ్చి – నన్ను రక్షించెను ||ఇడుగో||
చరణము 5
చెడుగు మెకములవలన – బాధల నొంది – కడు మలినమై యుంటినికడిగి గాయములన్ని – గట్టి శుభ్రము చేసి – తడయక నా యింట – నిడె నెమ్మది యుసంగె ||ఇడుగో||
చరణము 6
ప్రభుయేసు నా బోయుడు – ఈతడే భూమి – నభములలో లేడెడి రాయుడుశుభమైన తన దివ్య – శోణితమొసగియు – విశ్వవిభుండు ప్రేమించి – దీవించి స్వస్థము జేసె ||ఇడుగో||
చరణము 7
నన్ను దొడ్డిని బెట్టెను – పోయిన గొర్రె – తెన్ను వెదకి పెట్టెనుసన్నంపు పచ్చిక – యున్న జీవన పూట – లున్న గల్గెడి చోట్ల – నన్నుంచి రక్షించె ||ఇడుగో||
చరణము 8
నేను మూర్ఖపు గొర్రెనై – లోబడకుంటి – మానసమున వెర్రినైపూని యిప్పుడు కాచే – వాని శబ్దము ప్రేమ – తో నాలింపుచు దొడ్డి – నా నందమున నుందు ||ఇడుగో||
చరణము 9
చెడ్డ బిడ్డనై యుంటిని – ఇటు నటు బోవ – నెడ్డెతనము గొంటినిమొద్దు లేకిపుడు ప్రే – మింతు నా ప్రియ జనకు – దొడ్డ శబ్దము వాంఛిం – తును ముక్తి నిలయంబు ||ఇడుగో||