#162

యేసే రక్షకుడు

రాగం: శంకరాభరణము · తాళం: రూపకము · రచయిత: రావూరి లక్ష్మయ్య

Category: క్రీస్తు జీవితము — ఉపదేశములు · Open in the hymnal app

పల్లవి · Pallavi
అన్న మన యేసు ప్రభుని – కన్న రక్షకుడు లేడుఎన్నరాని మన అఘములు – అన్ని సడలించి ప్రోచు ||నన్న||
చరణము 1
మన దోషములకు బదులుగా – మరణావస్థల నొందెనుతన దివ్యావయవముల ర – క్తము చింతించెను భువిపై ||నన్న||
చరణము 2
నిజ రక్షకుడితడే మన – మృజినాదుల బరిమార్చెనువిజయంబగు నతని పాద – రజ యుగ్మమును స్మరింతు ||మనన్న||
చరణము 3
దిక్కుమాలిన వారికి – దిక్కై మార్గము జూపెనుచక్కని గుణముల సొంపు – పెక్కి వర్తించె నహహా ||యన్న||
చరణము 4
ఈలాటి దయాసముద్రు – నిల నెందైనను గానమునీలో గల దురు గుణాది – జాలములను గడద్రోయును ||అన్న||
చరణము 5
మృతి గెల్చినవాడే దు – రిత జీవుల బ్రోవ దగునుమృతి నొంది నశించు లోక – మూఢాత్మల కేల కల్గు ||నన్న||