#161

యేసు ప్రేమను స్తుతించుట

రాగం: బిలహరి · తాళం: అట · రచయిత: తూసిలి బెంజిమిన్

Category: క్రీస్తు జీవితము — ఉపదేశములు · Open in the hymnal app

పల్లవి · Pallavi
వింతగల మా యేసు ప్రేమును – సంతోషమున స్తుతింతునుపంతముగ దన ప్రాణమును పా – పులకు నియ్యను వచ్చి సిలువను – జచ్చి నన్ను రక్షించె నహహా ||వింత||
చరణము 1
ప్రీతిగల మా ప్రభుని కృప బహు – ప్రియముతో చాటింతునుసాధుగా నా కొరకు సిలువను – చాల శ్రమలు భరించి చావు జ – రగించి నన్ను రక్షించె నహహా ||వింత||
చరణము 2
పాడండి మా యేసు ప్రేమను – వేడండి మది గూడండిపాడండి తన దివ్య రక్తము – పాప క్రియముగ నిచ్చి శాపము – బాపి నన్ను రక్షించె నహహా ||వింత||
చరణము 3
నిత్య జీవము నిండు నెమ్మది – నిరతముగా నా కియ్యనురక్త శ్వేదము గారె నహహా – నరక శాపము ద్రుంచి యాపద – నుండి నన్ను రక్షించె నహహా ||వింత||