#158
ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు
పల్లవి · Pallavi
సీయోను కన్యా – సంభ్రమపడుచు – వేయుము కేకల్పాయక నీ రాజు – భారవాహక మెక్కిబాలస్తోత్రములతో – బైలుదేరి వచ్చె ||సీయోను||
చరణము 1
హెబ్రా భాషలోను – నీ రాజు పేరు – యూదుల రాజుహెబ్రీ జనులను – అబ్రాము కొడుకులను – విభవ దేశము జేర్చు – శుభరాజు యీతండే ||సీయోను||
చరణము 2
హెల్లేనీలోను – నీ రాజు పేరు – యూదుల రాజుయెల్ల పాపుల బ్రోచు – తాల్మి రక్షకుడితడు – చల్లని ప్రభువని – గొల్గొతా మ్రోగెను ||సీయోను||
చరణము 3
ఉర్వి రోమాలో – నీ రాజు పేరు – యూదుల రాజుసర్వ రాష్ట్రములకు – పూర్వ పితరులతోను – వర సింహాసన మిచ్చు – వరదేశాధిపతి యీతడు ||సీయోను||
చరణము 4
వాసిగ హెబ్రీ – హెల్లేనీ రోమాయులోనుహోసన్నా హోసన్నా – ప్రభుని పేరట వచ్చుమెస్సయ్య దావీదు – కొడుకా శ్రీ శుభములు ||సీయోను||