#157

వ్యాధి బాధిత రాలిని స్వస్థపరచుట

రాగం: ఆనందభైరవి (ఛాయ: దేవుని ప్రేమ ఇదిగో) · తాళం: కురుఝంపె · రచయిత: తూసిలి బెంజిమిన్

Category: క్రీస్తు జీవితము — ఉపదేశములు · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసు వస్త్రపు చెంగును – మాత్రము – యాశించి ముట్టినట్టిదోషకారుల రోగముల్ – వెంటనే – తొలగి పోయెను నిజముగ ||యేసు||
చరణము 1
గుంపు గూడిన జనులతో – ప్రభు యేసు – సొంపుతో బోవునప్పుడుతెంపుతో రమణి యొక్కతె – ప్రభు చెంగు – తెలియకుండను ముట్టెను ||యేసు||
చరణము 2
అంతటను రక్తధార – యామెకు – కింతైన లేకపోయెఇంతలో ప్రభువు యెరిగి – తన యొక్క – వింత జూపెను జనులకు ||యేసు||
చరణము 3
ప్రజలారా మీలో నొకరి కన్ – నాదు ప్ర – భావంబు స్వస్థపరచేనిజమంచు ప్రభువు చెప్ప – వణుకుతో – గజయాన వచ్చి నిల్చే ||యేసు||
చరణము 4
ఒదుగుచుండిన వనితతో – శ్రీ యేసు – అదురు మానుమి యింకనుఇదిగో నీ విశ్వాసము – రక్షించె – ముదిత నెమ్మదిని వెళ్ళు ||యేసు||
చరణము 5
ఏపుమీరగా యేసును – మీ యొక్క – ప్రాపుగా నమ్ముకొనుడిఆపదలు దొలగించును – నిజముగ – పాపము బాపును ||యేసు||