#156

క్రీస్తు తుఫానును నిమ్మళపరచుట

రాగం: ముఖారి · తాళం: త్రిపుట · రచయిత: తూసిలి బెంజిమిన్

Category: క్రీస్తు జీవితము — ఉపదేశములు · Open in the hymnal app

పల్లవి · Pallavi
ఏలాటివాడో కాని – ఈ యేసుని – నేమని వివరింతుముగాలివాన యేసుని – గద్దింపునకు చాల భయపడి నిలిచెను ||ఏలాటి||
చరణము 1
ముద్దు శిష్యులతోడను – సముద్రపు – అద్దరికి వెళ్ళనూకొద్ది పడవ నెక్కెను – ఇంతలోనే – పెద్దగాలి రేగెను ||ఏలాటి||
చరణము 2
అల్లకల్లోలముగా – సముద్రము – అల్లలాడునప్పుడుచల్లగ దోనె వెనుక – తలగడపైన – మెలల్ల నిద్రవోయెను ||ఏలాటి||
చరణము 3
చింత లేదా యేమయ్యా – బోధకుడా – నశించిపోవుచున్నాముఎంతో వేదన పడితిమి – కాపాడుమా – అంచు శిష్యులు లేపిరి ||ఏలాటి||
చరణము 4
దిగ్గున ప్రభువు లేచి – యా గాలిని – గద్దించిన వెంటనేతగ్గి నిమ్మళించెను – సమస్తము – సద్దులడగి పోయెను ||ఏలాటి||
చరణము 5
ఏల భీతులైతిరి – ఇంతలోనే – యెంత నమ్మిక లేదనిఈలాగు నోదార్చెను – యేసు తన – సొంత శిష్యుల నప్పుడు ||ఏలాటి||